పబ్‌–జీ ఖర్చు 10 లక్షలు

Mumbai Teen Spends Rs 10 Lakh From Mother Bank Account to Play PUBG - Sakshi

ముంబై: పబ్‌–జీ గేమ్‌కు బానిసైన ఓ 16 ఏళ్ల బాలుడు తన తల్లి బ్యాంక్‌ ఖాతాలోని రూ. 10 లక్షలను ఆట కోసం ఖర్చు చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల రోజులుగా బాలుడు పబ్‌–జీకి బానిసయ్యాడని, తల్లి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 10 లక్షలను వర్చువల్‌ కరెన్సీగా మార్చి ఖర్చు చేశాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి మందలించడంతో ఓ లెటర్‌ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top