బిడ్డకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య 

Mother Assasinate Her Child In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: కాంచీపురం వాలాజాబాద్‌ సమీపంలోని మురుగన్, ఉమా దంపతులు నివాసం ఉన్నారు. వీరికి దీపిక అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. దంపతులు ఒకే ఇంట్లో ఉన్నా, అభిప్రాయ భేదాల కారణంగా వేర్వేరుగా వంట చేసుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భర్తమీద ఆగ్రహంతో ఉన్న ఉమా మంగళవారం రాత్రి తన కుమార్తెకు విషం ఇచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది.

బుధవారం ఈ ఇద్దరు గది నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా మరణించి ఉండటంతో పోలీసులకు భర్త సమాచారం అందించాడు. మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: ఆన్‌లైన్‌ పాఠాలు..సెల్‌ఫోన్‌లో వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top