అత్యాచారం: ఇరవై ఆరేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Molestation Victim And Her Son Complaint On Accused Persons After 26 Years - Sakshi

లక్నో: తనపై ఆత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులపై 26 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ.  అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా ఆ నిందితుల బెదిరింపులకు భయపడి సాహసం చేయలేకపోయింది. కాగా, ఇప్పుడు తన కొడుకు సాయంతో వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరెల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1994లో షాజహన్‌పూర్‌లో బాధిత మహిళ తన సోదరితో కలిసి నివాసం ఉండేది. అప్పుడు ఆమె వయసు​ 12 ఏళ్లు. ఆమె సోదరి ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. ఆమె బావ ప్రభుత్వ ఉద్యోగి. సోదరి, బావ ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఇంటికి పక్కన ఉన్న హసన్‌, గుడ్డు అనే ఇద్దరు అన్నదమ్ములు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని, చెబితే చంపెస్తామని బెదిరించారు. అలా ఆమెపై రెండెళ్ల పాటు సామూహికంగా ఆత్యాచారం చేశారు.

ఈ క్రమంలోనే 1995లో బాధిత మహిళ గర్భవతి అయ్యారు. ఆ సమయంలో ఆమె సోదరి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలనుకుంది. అలా ఫిర్యాదు చేస్తే నిందితులు ఆమె సోదరిని కూడా చంపుతామని బెందిరించారు. బాధితురాలి గర్భం తీసివేసివేయాలని ఆమె సోదరి ప్రయత్నించారు. కానీ, వైద్యులు ఆమె ఆరోగ్యానికి ప్రమాదమని చెప్పడంతో విరమించుకున్నారు. బాధితురాలి బావకు మరో ప్రాంతానికి ఉద్యోగం బదిలీ కావటం వాళ్లు ఇల్లు వదిలి మరో ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో బాధిత మహిళ బాబుకు జన్మనించింది. అయితే ఆ బాబును ఆమె తన బంధువులకు దత్తత ఇచ్చింది.

2000 సంవత్సరంలో ఆమె వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెపై జరిగిన అత్యాచారాన్ని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు. ఆమె కుమారుడు తన తల్లి తనను దత్తత ఇచ్చిందని తెలుకున్నాడు. అనంతరం తల్లిని కలుసుకొని తన తండ్రి ఎవరని ప్రశ్నించాడు. జరిగిన విషయం తెలుసుకున్న కుమారుడు తన తల్లిపై ఆత్యాచారం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయలని ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె తన 24 ఏళ్ల కొడుకు సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. ముందుగా పోలీసులు వారిపై కేసు నమోదు చేయడాన్ని నిరాకరించారు. బాధిత మహిళ కోర్టును ఆశ్రయించడంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

చదవండి: ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top