చిన్నాన్న కాదు కామాంధుడు

బెంగళూరు: మైనర్ బాలిక(17)పై చిన్నాన్న అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఘటన దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో జరిగింది. 9వ తరగతి వరకు చదివి బాలిక బడి మానేసింది. మూడేళ్ల నుంచి చిన్నాన్న, చిన్నమ్మల వద్ద ఉంటుంది.
ఇటీవల ఆశా కార్యకర్త గ్రామానికి వచ్చినప్పుడు బాలిక కడుపుతో ఉన్న విషయం చూసింది. విచారించగా చిన్నాన్న లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఫిబ్రవరి నెలలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని బాలిక పోలీసుల విచారణలో తెలిపింది. కామాంధున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.