గ‘మత్తు’ టెన్నిస్‌ బంతులతో చిక్కారు..

Men Attempt To Throw Drug Filled Tennis Ball Inside Maharashtra Jail, Arrested - Sakshi

సాక్షి, ముంబై: ముగ్గురు మిత్రులు కలిసి మరో స్నేహితుడికి టెన్నిస్‌ బంతులు‌ ఇద్దామనుకున్నారు. పాపం వారి ప్రయత్నాలు ఫలించలేదు. సినిమాలలో క్లైమాక్స్‌ లో అంతా ముగిసిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకునే విధంగా కాకుండా సమయానికి పోలీసులు చేరుకొని వారిని అరె​స్ట్‌ చేశారు. ఏంటీ టెన్నిస్‌ బంతులు ఇస్తే అరెస్ట్‌ చేస్తారన్న ప్రశ్న మిమ్మల్ని తొలుస్తుందా? అయితే ఈ సంఘటన గురించి మీరు తెలుసుకోవాల్సిందే. (చదవండి: రూ. 287 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత)

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కొల్లాపూర్‌ జిల్లాలోని కలంబ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు జైలు గోడ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వ​ద్ద ఉన్న టెన్నిస్‌ బంతులను స్వాధీనం చేసుకొని, పరిశీలించగా వాటిలో మత్తు మందు గంజాయి ఉన్నట్లు తెలిసింది. నిందితులను అరెస్ట్‌ చేసి సంబంధిత సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. నిందితులు మత్తు మందును జైలులో ఉన్న తమకు సంబంధిత వ్యక్తికి అందించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసు అధికారుల ఆదేశాలతో  అప్రమత్తమైన జైలు అధికారులు సోదాలు చేయగా ఒక మొబైల్‌ ఫోను దొరికింది. ఫోను ఎవరికి సంబంధించినదో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: మాదకద్రవ్యాల కేసులో నిర్మాత భార్య అరెస్టు)  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top