ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి

గుడివాడ టౌన్: ఎదురింటి బాలుడిని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్‌మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30) తన ఎదురింటిలో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో పరారయ్యింది.
బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.
మరిన్ని వార్తలు