స్పీకర్‌ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒకరి మృతి

Man Passed Away After Being Hit by Vehicle in Telangana Speaker Convoy - Sakshi

డ్రైవర్‌పై కేసు నమోదు

మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్న స్పీకర్‌ పోచారం 

మనోహరాబాద్‌ (తూప్రాన్‌): శాసనసభ స్పీక ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టిన సంఘటన లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లక ల్‌ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్పీ కర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కాన్వా య్‌తో హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు వెళుతున్నారు. అదే సమయంలో కాళ్లకల్‌ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిని దాటుతు న్న దొంతిరెడ్డి నరసింహారెడ్డి (62)ని కాన్వాయ్‌ లోని వెనుక వాహనం ఢీ కొట్టింది.

దీంతో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడే నిలిచిపోగా, స్పీకర్‌ మిగతా కాన్వాయ్‌ ముందుకు వెళ్లిపోయింది. మృతుడు  దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ప్రమాద సమాచారాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక ఎస్‌ఐ రాజాగౌడ్‌ చెప్పారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని స్పీకర్‌ ఫోన్‌లో చెప్పారని ఎస్‌ఐ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top