మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది.. | Man Molested Brothers Wife In Tamilnadu | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది..

Jun 18 2021 9:06 AM | Updated on Jun 18 2021 9:06 AM

Man Molested Brothers Wife In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వేలూరు(తమిళనాడు): లైంగికంగా వేధించిన మరిదిని వదిన హత్యచేసిన సంఘటన తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పరమనందాల్‌ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాజ(48), సెల్వం అన్నదమ్ములు. వీరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిస అయిన రాజ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఆమె పుట్టింటికి వెళ్లింది. రాజ అన్న సెల్వం బుధవారం ఉదయం లారీ డ్రైవర్‌ పనికి వెళ్లాడు. పరాశక్తి రాత్రి ఇంటిలో నిద్రించింది.

రాత్రి మద్యం మత్తులో ఉన్న రాజ వదిన పరాశక్తిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆగ్రహించిన పరాశక్తి ఇంటిలో ఉన్న కత్తితో రాజ తలపై నరికింది. రాజ అక్కడిక్కడే మృతి చెందాడు. సెంగం పోలీసులు అక్కడికి చేరుకుని పరాశక్తిని అరెస్ట్‌ చేశారు.   

చదవండి: బైక్‌ ఆపాడని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement