జియోలో ఉద్యోగం.. రూ.7.48 లక్షలు మాయం  | Man Cheated Ameerpet Woman InThe Name Of Jio Job | Sakshi
Sakshi News home page

జియోలో ఉద్యోగం.. రూ.7.48 లక్షలు మాయం 

Jul 1 2021 10:37 AM | Updated on Jul 1 2021 10:47 AM

Man Cheated Ameerpet Woman InThe Name Of Jio Job - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌: సంపన్న వర్గానికి చెందిన ఓ యువతికి సైబర్‌ నేరగాడు భారీ టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం నౌకరీ డాట్‌ కామ్‌లో రెజ్యూమ్‌ పెట్టింది. రెజ్యూమ్‌ చూసిన సైబర్‌ నేరగాడు జియో కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మీ రెజ్యూమ్‌ను జియో హెచ్‌ఆర్‌కు ఫార్వర్డ్‌ చేశానని, మీ చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నాడు.

జియో సంస్థ కావడంతో అత్యాశకు పోయిన యువతి సైబర్‌ నేరగాడు అడిగిన విధంగా పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.7.48 లక్షలను పంపింది. రోజులు గడిచినా జియో సంస్థ నుంచి ఫోన్‌ రాకపోవడంతో పలుమార్లు ఆమెకు పరిచయమైన వ్యక్తికి ఫోన్‌ చేసి అడిగింది. వారం, పదిరోజులు అంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో తాను వెసపోయినట్లు గ్రహించి బుధవారం సాయంత్రం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

చదవండి: అత్యాచార నిందితుడితో యువతి అరెస్ట్‌.. బాధతో గుండె పగిలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement