శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేష్‌ అరెస్ట్‌

Mahesh Kathi Was Arrested By Hyderabad Cyber ​​Crime Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు‌ కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  గతంలోనూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. (కత్తి మహేష్‌పై మరో కేసు)

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెడితే కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరికాలు జారీ చేసిన నేపథ్యంలో  పోలీసులు తొలి అరెస్ట్ చేశారు. టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి ఉస్మానియా, కింగ్ కోఠి  ఆసుపత్రులలో వైద్యపరీక్షలు నిర్వహించి రిమాండ్ కు తరలించారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో కత్తి మహేష్‌పై  ఐపిసి సెక్షన్ 153(a) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్  పోలీసులు. తన ట్విటర్‌లో రాముడు కరోనా ప్రియుడు అంటూ పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేశామని  పోలీసులు తెలిపారు.

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top