కత్తి మహేష్‌పై మరో కేసు

Hyderabad Police Filed Case On Kathi Mahesh Over His Comments on Lord Sri Rama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఉమేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు.

ఇవే ఆరోపణలతో అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్‌‌ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. కాగా, గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top