భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్‌ అరెస్ట్‌

Maharashtra: YouTuber Jeetu Jaan Arrested Over Death Of His Wife - Sakshi

ముంబై: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్య మృతికి అతడే కారణమని ఆరోపణలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని బందూప్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తమ అమ్మాయిది ఆత్మహత్య కాదు.. హత్యేనని బాధితురాలి తల్లి, సోదరి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. జితేంద్ర, కోమల్‌ అగర్వాల్‌ భార్యాభర్తలు. వీరు ముంబైలో నివసిస్తున్నారు. భర్త జితేంద్ర ప్రముఖ యూట్యూబర్‌. అతడి ఛానల్‌ పేరు ‘జిత్‌ జాన్‌ (Jeetu Jaan)’. అయితే ఇటీవల భార్య కోమల్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమల్‌ది ఆత్మహత్య కాదు హత్యేనని ఫిర్యాదు చేయడంతో జితేంంద్రను అరెస్ట్‌ చేశారు. 

‘అక్కను మానసికంగా శారీరకంగా జితేంద్ర వేధింపులకు గురి చేసేవాడు. రెండు మూడుసార్లు నన్ను కూడా వేధించాడు. కొంతమంది స్నేహితురాళ్లను కూడా వేధించాడు. వేధింపులు తట్టుకోలేక ఒకసారి ఒక్క ఇంట్లోంచి బయటకు వచ్చేసింది కూడా. అతడి వేధింపులతోనే అక మరణించింది. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కోమల్‌ సోదరి ప్రియ తెలిపింది. కేసు దర్యాప్తులతో ఉందని పోలీసులు తెలిపారు.

చదవండి: లాక్‌డౌన్‌తో పాన్‌ బ్రోకర్‌ దంపతులు ఆత్మహత్య
చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..! ’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top