
క్రిష్ణగిరి(బెంగళూరు): క్రిష్ణగిరి సమీపంలో యువకుడు అర్ధరాత్రి సమయంలో ప్రేయసిని కలిసేందుకెళ్లిన యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సింగారపేట సమీపంలోని నాయకనూరుకి చెందిన మురుగన్ కొడుకు వెంకటేష్ (20) కూలీ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఇతర వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తూ వచ్చాడు. (చదవండి: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే )
ఆదివారం అర్ధరాత్రి సమయంలో కుటుంబసభ్యులకు తెలియక ప్రేయసిని కలిసేందుకెళ్లిన వెంకటేష్ సోమవారం ఉదయం తీవ్ర గాయాలతో శవమై కనిపించాడు. వెంకటేష్ బంధువులు సింగారపేట–అత్తిపాడి మార్గంలో ఆందోళన నిర్వహించారు. ఎస్పీ సాయ్‌చరణ్ తేజస్వి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. ఒక పొలానికి ఉన్న కంచెలో ఇరుక్కుని మరణించాడని పోలీసులు చెప్పారు. పొలం యజమానిని అరెస్టు చేశారు.