దూరం చేస్తారన్న మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం 

Love Couple Committed Suicide Attempt At Madanapalle - Sakshi

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మండలంలో ఓ ప్రేమజంట శుక్రవారం రాత్రి  పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితులు, ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు,  మదనపల్లె మండలం చీకిలబైలుకు చెందిన అమర(22) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వలసపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన స్రవంతి(22) పుంగనూరు రోడ్డులోని 150మైలు వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. (ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య)

ఇద్దరూ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబసభ్యులు వీరిని మందలించారు. దూరం చేస్తారన్న మనస్తాపంతో కృష్ణాపురం సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు బాధితులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సంఘటనపై రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
(మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top