Khammam: Infant Dead Body Found In Mudigonda - Sakshi
Sakshi News home page

‘నేనేం పాపం చేశానమ్మా’.. ముళ్లపొదల్లో నెలలు నిండని శిశువు మృతదేహం

Dec 25 2021 12:32 PM | Updated on Dec 25 2021 1:30 PM

Khammam: Infant Dead Body Found In Mudigonda - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే...

సాక్షి, ఖమ్మం: మాతృత్వానికి నోచుకోక ఎంతో మంది మహిళలు అల్లాడుతున్నారు. అలాంటిది చందమామలాంటి పిల్లలను కొందరు నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నవమాసాలు గర్భంలో ఉన్న శిశువులు కళ్లు తెరవకముందే హత్య చేసేస్తున్నారు. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఆలయాలు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. 

తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ముదిగొండ మండలం పెద్దమండవలో శుక్రవారం ఓ వీధిలో సీసీ రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పూర్తిగా నెలలు నిండకముందే గర్భం నుంచి తొలగించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు తీసుకెళ్లి ఖననం చేశారు.  అయితే ఇదే గ్రామామికి చెందిన శిశువు మృతి చెందగా స్లానికులు పాతి పెట్టినట్లు తెలుసోంది. కుక్కలు వెలికి తీసి పొదల్లోకి ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తోంది.
చదవండి: ఒకే ఎఫ్‌ఐఆర్‌తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్‌

Advertisement
 
Advertisement
Advertisement