
బనశంకరి: నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ పై నుంచి దూకి ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వివేకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివేక్ మధుసూదన్ (60) అనే వైద్యుడు అక్కడి నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్టుమెంటులో ఫ్లాటు కొంటానని వచ్చాడు. 15వ అంతస్తుకు వెళ్లి దూకడంతో ప్రాణాలు పోయాయి. ఈయన కుటుంబకలహాలతో భార్యకు విడాకులు ఇచ్చారు. కరోనా, లాక్‌డౌన్‌తో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానం ఉంది. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.