
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సంగెం మండలం గవి చర్ల శివారులో ఓ జీపు అదుపు తప్పి బావిలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 10 మంది సురక్షితంగా బయటపడగా, మరో నలుగురు బావిలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.