మైనర్‌ను గర్భవతి చేసి అబార్షన్‌ చేయించిన మారు తండ్రి  | Hyderabad: Stepfather Molested Minor Daughter And had An Abortion | Sakshi
Sakshi News home page

మైనర్‌ను గర్భవతి చేసి అబార్షన్‌ చేయించిన మారు తండ్రి 

Mar 15 2022 8:22 AM | Updated on Mar 15 2022 11:55 AM

Hyderabad: Stepfather Molested Minor Daughter And had An Abortion - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దుండిగల్‌: మైనర్‌ బాలికని గర్భవతి చేసి అబార్షన్‌ చేయించిన మారు తండ్రిని దుండిగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్‌లో పదేళ్లుగా ఓ జంట సహజీవనం చేస్తోంది. కాగా సదరు మహిళ కుమార్తె(12)పై మారు తండ్రి కన్నేశాడు. ఈ క్రమంలో బాలికను లోబర్చుకుని గర్భవతి చేశాడు. విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని ఓ ఆర్‌ఎంపీ ద్వారా నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌ చేయించాడు.

అయితే బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బొల్లారంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. అయితే విషయాన్ని గుర్తించిన సదరు ఆర్‌ఎంపీ దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా బాలికకు అబార్షన్‌ చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు ఇంకేమైనా చోటు చేసుకున్నాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement