అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్‌ వ్యక్తి

Hyderabad Man Stabbed To Death In US - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన 37ఏళ్ల వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. వివరాలు.. పాతబస్తీ చంచల్ గూడాకు చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ మోహియుద్దీన్‌ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా జర్జియాలో నివాసముంటున్నాడు. అక్కడ స్థానికంగా కిరణా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి వద్ద ఉన్న ఆరిఫ్‌పై కొంతమంది దుండగులు దాడి చేసి అనంతరం కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరిఫ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చదవండి: కుటుంబంలో చిచ్చు రేపిన కలహాలు 

ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆరిఫ్‌ కుటుంబ సభ్యులకు జార్జియా పోలీస్ అధికారులు సమాచారం అందించారు. దీంతో తను, తన తండ్రి అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్‌ భార్య మెహ్నాజ్ ఫాతిమా వేడుకున్నారు. యూఎస్‌లో తమకు ఎలాంటి బంధువులు లేరని, భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.అదే విధంగా ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో మాట్లాడినట్లు, అతను అరగంటలో తిరిగి కాల్‌ చేస్తానని చెప్పినట్లు ఫాతిమా తెలిపారు. చదవండి: విషాదం: నీ వెంటే మేమూ!

కానీ అతని నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదని కొంత సమయానికి తన భర్తను ఎవరో పొడిచి చంపినట్లు బావ ద్వారా తెలిసిందన్నారు. జార్జియాలోని ఆసుపత్రిలో ఉన్న భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణకు చెందిన పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఫాతిమాను యూఎస్‌ పంపించాలని కోరుతూ కుటుంబం తరపున లేఖ రాశారు.

 .

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top