ప్రియుడితో సన్నిహితంగా ఉన్న భార్యను.. | Husband Eliminates Wife Over Her Extra Marital Affair Hosur Karnataka | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: భార్యను హత్య చేసిన భర్త

May 1 2021 9:24 AM | Updated on May 1 2021 9:48 AM

Husband Eliminates Wife Over Her Extra Marital Affair Hosur Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హోసూరు: వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టిన భార్యను, ఓ భర్త బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని హోసూరు తాలూకాలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామంలో చెన్నబసప్ప(44), గౌరమ్మ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. గౌరమ్మకు పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటంతో మందలించినా ఆమె పట్టించుకోలేదు. గురువారం రాత్రి ఆమె ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చెన్నబసప్ప కంట పడింది.

దీంతో భార్యను కడతేర్చాలని పథకం రచించాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను వేపనపల్లి సమీపంలోని కే.ఎన్‌.పోడూరుబసవేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి తలపై బండరాయితో బాది హత్య చేశాడు. శుక్రవారం ఉదయం హోసూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సమాచారం అందుకున్న వేపనపల్లి పోలీసులు గౌరమ్మ మృతదేహాన్ని శవపరీక్ష కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.    

చదవండి: అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement