వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయండి: అవంతి

Hemanth Murder Case: Avanthi Demands Accused Encounter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హేమంత్‌ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్‌కౌంటర్‌ చేయాలని అతని భార్య అవంతిరెడ్డి డిమాండ్‌ చేశారు. తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. నాపై ప్రేమ ఉంటే నేను ప్రేమించిన వ్యక్తిని చంపుతారా? మా అమ్మానాన్నల కంటే అత్తామామ ఎక్కువగా ప్రేమిస్తారు. మా ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారు.
(చదవండి: హేమంత్ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు)

హత్యలో మేనమామలు ఇన్‌వాల్వ్‌ అవుతారని అనుకోలేదు. మేనమామలు విజేందర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, కలిసి చేశారు. నా భర్తను హత్య చేసిన వారందరినీ ఎన్‌కౌంటర్ చేయాలి’అని అవంతి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కాగా, కూతురు ప్రేమ పెళ్లి నచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్‌ని హత్య చేయించారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డి. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్‌ హత్య చోటుచేసుకుంది.
(చదవండి: మరో ‘పరువు’ హత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top