ముగిసిన కస్టడీ, కడప సెంట్రల్ జైలుకు జేసీ

సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. దళిత పోలీస్ అధికారిని దూషించిన కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జేసీని శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో పోలీసులు ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!)
త్రీటౌన్ పీఎస్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. దళిత సీఐ దేవేంద్రను ఎందుకు దూషించారు? పోలీసు అధికారులపై పదేపదే ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు? కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? జనంతో ఎందుకు ర్యాలీ నిర్వహించారు? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నలు సంధించారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేశారు. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి