బాలుడి అదృశ్యం కలకలం | Five Years Boy Kidnaped In Suryapet District | Sakshi
Sakshi News home page

బాలుడి అదృశ్యం కలకలం

Nov 15 2020 12:26 PM | Updated on Nov 15 2020 4:08 PM

Five Years Boy Kidnaped In Suryapet District - Sakshi

సాక్షి, సూర్యపేట: జిల్లా కేంద్రంలో బాలుడి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. దీపావళి టపాకాయల కోసం వెళ్లిన 5 ఏళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాకపోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన పరికపల్లి నగేష్, నాగలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు గౌతమ్. ఆ బాలుడు నిన్న( శనివారం) సాయంత్రం వారి ఇంటికి పక్కనే ఉన్న ఓ కిరాణం షాపులో దీపావళి బాంబుల కోసం తన సైకిల్‌పై వెళ్లాడు. కిరాణ షాప్‌లో బాణాసంచా కొనుగోలు చేసిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. తమ కుమారుడు ఎంతకు ఇంటికి రాకపోవటంతో ఆందోళనపడిన తల్లిదండ్రులు బాలుడు కోసం గాలించగా కిరాణం షాప్‌కి కొద్ది దూరంలో బాలుడు తీసుకువెళ్లిన సైకిల్ మాత్రం కింద పడిపోయి ఉంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని ఎవరైనా కిడ్నప్ చేసారా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement