దారుణం: 30 వేల కోసం కన్న కొడుకునే.. | Father Sold His Son At Rajendra Nagar In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని

Apr 17 2021 4:17 PM | Updated on Apr 17 2021 4:29 PM

Father Sold His Son At Rajendra Nagar In Hyderabad - Sakshi

బాబును అమ్మి ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని సయ్యద్‌ తన భార్యతో గొవడ పడ్డాడు.

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి డబ్బుల కోసం రెండు నెలల తన కొడుకును విక్రయించాడు. ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎంఎం పహాడిలో నివాసం ఉంటున్న సయ్యద్‌ హైదర్‌, షహానా బేగం దంపతులకు రెండు నెలల చిన్నారి ఉన్నాడు. గత రెండు మూడు రోజుల నుంచి బాబును అమ్మి ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని సయ్యద్‌ తన భార్యతో గొవడ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం తండ్రి సయ్యద్‌ తన చిన్నారిని విక్రయించాడు. తల్లి షహానా బేగం నమాజ్‌కు వెళ్లిన సమయంలో సయ్యద్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

చిన్నారి కనిపించక పోవడంతో భర్తపై అనుమానంతో భార్య షహానాబేగం పోలీసులను ఆశ్రయించారు. తన భర్త రూ.30వేల కోసం, ఇంట్లోకి వస్తువుల తీసుకోవడానికి బాబును అమ్మేశాడని భార్య రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని షహానా బేంగం పోలీసులను కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి:  దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement