తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానని మోసం

Father And Son Cheated Saying Give Them Vehicles At Cheaper Price - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ సబ్సిడీ వెహికల్‌ పాలసీ(సీఎస్‌వీపీ) కింద తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానంటూ తండ్రి కొడుకులు తమను మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్‌ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహ్మద్‌ ఖుష్రో అహ్మద్‌ ఫారూఖీ అనే వ్యాపారికి దూరపు బంధువులైన ఖాజా నసీరుద్దీన్, అతడి కుమారుడు జియాయుద్దీన్‌ తమకు రాజకీయ పలుకుబడి ఉందని, ఆ పలుకుబడితో కార్లు, ట్రక్స్, మోటర్‌ సైకిల్స్‌ సబ్సిడీపై ఇప్పిస్తామని చెప్పారు.

వీరి మాటలు నమ్మిన ఫారూకీ రూ. 1.61 కోట్లు వాహనాల కోసం చెల్లించాడు. అయితే వాహనాలు ఇప్పించక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేశాడు. దీంతో రూ. 66 లక్షలు తిరిగి చెల్లించి, మిగతా వాటికి గ్యారంటీగా చెక్కులు ఇచ్చారు. ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తమతో పాటు మరికొందరిని స్కీమ్‌ల పేర్లతో మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   

(చదవండి: ముందుగా బేరం.. కానీ మధ్యలో రూ. 5 వేలు చోరీ చేసిందని చంపేశాడు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top