కలెక్టర్‌ ఫోటోతో వాట్సాప్‌ ఖాతా తెరిచి..

Fake Whatsapp Account Narayanpet Collector, And Demand Money - Sakshi

సాక్షి, నారాయణపేట: ఏకంగా కలెక్టర్‌ ఫొటోతో నకిలీ వాట్సాప్‌ ఖాతాను తెరవడమేగాక.. ఆ నంబర్‌ నుంచి పలువురికి సందేశాలు పంపి రూ.2.4లక్షలు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమేరకు ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించిన వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్‌ పేరిట నారాయణపేట కలెక్టర్‌ దాసరి హరిచందన ఫొటోతో వాట్సాప్‌ ఖాతా తెరిచాడని, దాన్నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు సందేశాల పంపించాడని తెలిపారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి అమేజాన్‌ పే యాప్‌ ద్వారా కొంత కొంత మొత్తం చొప్పున పలు దఫాలుగా రూ.2,40,000 సైబర్‌ నేరగాడు వేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నకిలీ ఖాతా విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎన్‌సీఆర్‌పి పోర్టల్‌ ద్వారా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేసి విచారించామని తెలిపా రు. ఈ వాట్సాప్‌ నంబర్‌కు, జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్‌ హరిచందన సైతం పేర్కొన్నట్లు తెలిపారు. ఎవరికైనా సందేహాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. 
చదవండి: బీజేపీ కార్యకర్త మృతి.. వచ్చే నెల 4వ తేదీనే పెళ్లి..

జార్ఖండ్‌ వ్యక్తిగా గుర్తింపు 
నకిలీ వాట్సాప్‌ ఖాతా సృష్టించి మోసం చేసిన అతను జార్భండ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సామాజిక మాద్యమాల్లో ఇలా అధికారుల ఫొటోలు పెట్టి డబ్బులు అడుగుతుంటారని, అలాంటి వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్‌ నేరాల నుంచి రక్షణకు ఎన్‌సిఆర్‌పి పోర్టల్, టోల్‌ఫ్రీ నం.1930 కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top