బీజేపీ కార్యకర్త మృతి.. ఖమ్మంలో టెన్షన్‌ టెన్షన్‌..

BJP Activist Sai Ganesh Marriage On May 4th Who Commits Suicide In PS - Sakshi

సాక్షి, ఖమ్మం: పోలీస్‌ స్టేషన్‌లో పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. పోస్టుమార్టం పూర్తైన అనంతరం సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. 

కాగా వచ్చే నెల 4వ తేదీన సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగానని తమతో సాయి గణేష్ చెప్పాడనీ బంధువులు చెబుతున్నారు.
సంబంధిత వార్త: సాయి గణేష్ మృతి.. అలాంటి పోలీసులను వదిలిపెట్టం: బండి సంజయ్‌

ఖమ్మంలో టెన్షన్‌
ఖమ్మం పట్టణంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతి నేపథ్యంలో మంత్రి అజయ్‌ కుమార్‌ కార్యాలయం, జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే పోలీసులు సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టారని, దీనిలో భాగంగానే తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కార్యాలయం నాలుగు వైపులా భారీ గేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top