యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్‌ ట్విస్ట్‌

Fake Police Cheated Software Employee In Hyderabad - Sakshi

అమీర్‌పేట(హైదరాబాద్‌): ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నకిలీ పోలీసులు బురిడీ కొట్టించారు. పశ్చిమగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన మౌళి నగరంలోని బల్కంపేట వెన్నం అపార్ట్‌మెంట్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యాప్‌లో యువతుల కోసం ఆరా తీసి బీకేగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు.
చదవండి: భర్త కోసం భార్య మౌన పోరాటం

ఇద్దరు యువతులతో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. తాము పోలీసులమని బెదిరించి అతడి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ఫోన్‌ పే ద్వారా తన అకౌంట్‌లో నుంచి రూ.14500 బదిలీ చేసుకుని సెల్‌ తీసుకుని వెళ్లి పోయారు. వచ్చిన వ్యక్తులు నకిలీ పోలీసులని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top