వివాహేతర సంబంధం.. భార్య ప్రియుడు గ్రామానికి వచ్చాడని తెలిసి.. | Extramarital Affair: Man Kills Wife Boyfriend In Tamilnadu | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భార్య ప్రియుడు గ్రామానికి వచ్చాడని తెలిసి..

Nov 13 2021 8:56 AM | Updated on Nov 13 2021 10:03 AM

Extramarital Affair: Man Kills Wife Boyfriend In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  తిరువొత్తియూరు(తమిళనాడు): కన్యాకుమారి జిల్లా తక్కలైలో నడిరోడ్డుపై భార్య ప్రియుడిని భర్త తన మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ దాడి జరిగింది. గాయపడిన అతన్ని స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా పారిపోయాడు.

విచారణలో తక్కలై సమీపంలోని తిరువిదాంగోడుకు చెందిన పూజారి (45)కి భార్య (34), ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకు వేరొకరితో వివాహేతర ఏర్పడడంతో 8 నెలల కిత్రం అతనితో పారిపోయింది. దీనిపై తక్కలై పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. భార్య ప్రియుడు తక్కలైకి వచ్చినట్లు సమాచారం తెలియడంతో మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement