కాబోయే భర్తతో కలిసి బాస్‌ను‌ హత్యచేసిన మహిళ

Delhi Businessman Was Killed By Employee Fiancee - Sakshi

సాక్షి, ఢిల్లీ:  కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్యచేసిందో మహిళ. ఢిల్లీలో నీరజ్‌ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్‌ నగర్‌లో ఉంటున్నాడు. అయితే అతను తప్పిపోయినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్‌ అనే మహిళ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొం‍ది. ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఫైసల్‌ గుప్తా దగ్గర పనిచేసేదని, గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.చదవండి:(భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా)

వివరాల్లోకి వెళితే.. పైజల్‌కు జుబేర్‌ అనే వ్యక్తితో నిశ్చితార్థం కాగా, ఆ విషయాన్ని నీరజ్‌ గుప్తాకు తెలిపింది. అయితే వివాహానికి గుప్తా అభ్యంతరం తెలపడంతో నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్‌టెన్షన్‌లో పైజల్‌ అద్దె ఇంటికి వచ్చి  తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో  పొడిచిన తరువాత  అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్.‌ ఫైజల్‌ తల్లి జుబెర్‌కు సహయాన్ని అందించారు.అతని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లారు. గుజరాత్‌ భరూచ్‌ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు.  హత్య చేసిన నిందితులు  పైజల్‌ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్‌వెస్ట్ జోన్‌ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top