ఘరానా మోసగాడు అరెస్ట్‌

Deepak Kindo was arrested by the Hyderabad Central Crime Station authorities - Sakshi

నాబార్డ్‌ అనుబంధ సంస్థకు టోకరా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో పలు ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల్ని మోసం చేసిన ఘరానా నిందితుడు దీపక్‌ కిండోను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు రూ.200 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన ఇతనిపై ఆయా రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి సోమవారం వెల్లడించారు.

ఒడిశాలోని రూర్కెలా కేంద్రంగా పనిచేస్తున్న సంబంధ్‌ ఫిన్‌సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు దీపక్‌ ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. నాబార్డ్‌కు అనుబంధంగా పనిచేసే నవ్‌సమృద్ధి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నుంచి సంబంధ్‌ సంస్థ పేరుతో దీపక్‌ రూ.5 కోట్ల క్రెడిట్‌ ఫెసిలిటీ తీసుకున్నాడు. 2019 మార్చి ఒకటిన ఈ మొత్తాన్ని తన సంస్థ ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో నవ్‌సమృద్ధి నిర్వాహకులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top