మహేష్‌పై 9 రౌండ్ల కాల్పులు జరిపారు: డీసీపీ

DCP Vikrant Patil Talks About Vijayawada Mahesh Murder Case - Sakshi

సాక్షి, విజయవాడ: మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హత్య, దోపిడి(మర్డర్‌ ఫర్‌ గెయిన్‌)తో పాటు మరణాయుధాల చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే నిందితులు ఇద్దరు ఆటోలో వచ్చినట్టు గుర్తించామని మహేష్ హత్య తర్వాత నిందితులు కారు వదిలిన ప్రాంతంలో సీసీ ఫుట్టేజ్‌లను పరిశీలిస్తున్నామని చెప్పారు. (చదవండి: బెజవాడ మహేష్‌ హత్య కేసులో కొత్త కోణం)

కాల్పుల సమయంలో మహేష్‌తో పాటు స్పాట్‌లో ఉన్న నలుగురినీ విచారిస్తున్నామని తెలిపారు. మహేష్ కుటుంబ సభ్యుల అనుమానాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, మహేష్‌పై నిందితులు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారని, అయిదు రౌండ్లు కాదని డీసీపీ స్ఫష్టం చేశారు. బులెట్ల ఆధారంగా నిందితులు 7.5 ఎమ్ఎమ్ బుల్లెట్లు వాడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగవంతం చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top