ఊరి చివర తోటలో ఉరి వేసుకుని.. | Couple Takes Own Life By Hanging In A Garden | Sakshi
Sakshi News home page

ఊరి చివర తోటలో ఉరి వేసుకుని..

Jan 16 2021 4:31 PM | Updated on Jan 16 2021 4:37 PM

Couple Takes Own Life By Hanging In A Garden - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడింది. టెక్కలి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పిట్టల సరియలో ఊరి చివర ఉన్న తోటలో ఇప్పిలి రాజేష్‌, పాలిన వేనమ్మలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధమే మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

చదవండి : ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement