టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు | Sakshi
Sakshi News home page

టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Published Tue, Mar 5 2024 3:54 PM

Commercial Tax Department Raids On Tonique Liquor Groups Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్‌షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్‌కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు.

టానిక్ గ్రూప్‌లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్‌లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు.

ఇదీ చదవండి: Delhi: దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు

Advertisement
 
Advertisement
 
Advertisement