
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
రాజాపూర్: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పానని.. మనస్తాపానికి గురైన ఒక బీటెక్ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన మీసేవా కేంద్రం నిర్వాహకుడు సున్నపు రాధాకృష్ణ కుమారుడు సుభాశ్(22) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, సుభాశ్ బీటెక్‌లో కొన్ని సబ్జెక్ట్‌లు ఫెయిలైన విషయాన్ని దాచి.. పాస్ అయినట్టు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని లోలోపలే మధనపడ్డాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సుభాశ్.. ఉరి వేసుకుని మృతి చెందాడు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.