Boy Died Under Suspicious Circumstances At Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాబు మృతదేహాన్ని పీక్కుతున్న వీధి కుక్కలు

May 19 2022 4:47 PM | Updated on May 19 2022 7:21 PM

Boy Died Under Suspicious Circumstances At Hyderabad - Sakshi

సోఫియన్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కుల్సుంపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాబు మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడిని సోఫియన్‌గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  మరోవైపు.. బాబును ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మిస్టరీగా వందన మృతి.. సందీప్‌ ఇంట్లో ఏం జరిగింది..?

Advertisement
 
Advertisement
Advertisement