నగ్నచిత్రాల కేసులో ఇరుపక్షాల రాజీ!

Bathing Video Filming Case Compromise in Tenali Police Station - Sakshi

తెనాలి రూరల్‌:  తనతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తె స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో చిత్రీకరించాడని పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన మహిళ రూరల్‌ ఎస్పీకి స్పందన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేసింది. కేసు తెనాలి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు ఎస్పీ కార్యాలయం పంపగా, ఫిర్యాది, నిందితుడిని పోలీసు అధికారులు పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ పడినట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే కూతురితో కలసి అప్పటికే వివాహమై పిల్లలు ఉన్న వ్యక్తితో 2009 నుంచి సహజీవనం చేస్తోంది.

సదరు వ్యక్తి కూడా భార్య నుంచి విడాకులు పొందలేదు. మహిళ కుమార్తె, తన కుమార్తెను అతనే బీటెక్‌ చదివించాడు. ఇరువురు కుమార్తెల పెంపకం విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి.  అప్పటి వరకు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివశించిన వీరు మూడేళ్ల క్రితం త్రీ టౌన్‌ పరిధిలోని ఇందిరా కాలనీకి వచ్చారు. ఇరువురి మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడంటూ మహిళ  ఫిర్యాదు చేసింది. అయితే సీఐ బి.హరికృష్ణ ఇరువురినీ పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ అయ్యాయని, కేసు ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్టు భావిస్తున్నామని సీఐ వివరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top