పెళ్లయిన 9 నెలలకే.. | Bangalore: Newly Married Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు వివాహిత బలి

Sep 26 2020 6:32 AM | Updated on Sep 26 2020 6:32 AM

Bangalore: Newly Married Woman Commits Suicide - Sakshi

మేఘ (ఫైల్‌)

సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులు తాళలేక  వివా­హిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకా­లోని మాస్తి ఫిర్కా దొడ్డకల్లహళ్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరు రూరల్‌ జిల్లా ఆనేకల్‌ తాలూకా అత్తిబెలె ఫిర్కా మంచేనహళ్లి గ్రామానికి చెందిన మేఘను మాలూరు తాలూకా మాస్తి ఫిర్కా దొడ్డకల్లహల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప పెద్ద కొడుకు మహేష్‌ చంద్రకు ఇచ్చి 9 నెలల క్రితం వివాహం చేశారు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురం.. అనంతరం కట్నం కోసం వేధింపులు మొదలు కావడంతో నెలన్నర క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి తిరిగి పంపారు. అయితే గురువారం రాత్రి ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.  భర్త ఇంటివారే తమ కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  భర్త మహేష్‌ చంద్ర,  అతని అక్క భర్త రేవణ్ణలను అరెస్టు చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement