బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం

Attempted Suicide Young Woman Engaged To BJP Activist Sai Ganesh - Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌తో నిశ్చితార్థం జరిగిన యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి మనస్థాపంతో ఉన్న యువతి విజయ ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో సాయి గణేష్ నిర్మించాలనుకున్న బీజేపీ పార్టీకి సంబంధించిన దిమ్మె స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వెంటనే గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగ్రహం

వచ్చే నెల 4వ తేదీ సాయి గణేష్, విజయ వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ ఖమ్మం  త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి గణేష్.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు. ఆ తర్వాత సాయి గణేష్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.. సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కూడా నడుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top