పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి.. | Accident While Returning Home From Wedding At Vijayapura | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి.. 

Feb 10 2023 8:13 AM | Updated on Feb 10 2023 8:13 AM

Accident While Returning Home From Wedding At Vijayapura   - Sakshi

సాక్షి, యశవంతపుర: లారీ, ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన దావణగెరె తాలూకా రామగొండనహళ్లి వద్ద బుధవారం రాత్రి జరిగింది. కారులో ప్రయాణిస్తున్న బిల్లహళ్లి మంజునాథ్‌(24), పాండోమట్టి అమృత్‌ (23)లు మృతులు.  కారులో దావణగెరెలో పెళ్లికి వెళ్లి తిరిగి చెన్నగిరి తాలూకా పాండోమట్టికి వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను, తరువాత లారీని కారు ఢీకొంది.

కారు పూర్తిగా నుజ్జునుజ్జుయింది. ఇద్దరు చనిపోగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాయకొండ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో పెళ్లి కావలసిన యువకులు మృతి చెందటంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.   

క్యాంటర్‌ ప్రమాదం.. ఒకరి మృతి  
విజయపుర జిల్లా ఇండి పట్టణంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన క్యాంటర్‌ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పి సర్కిల్‌ను ఢీకొంది. డ్రైవర్‌కు బలమైన గాయాలయ్యాయి. డ్రైవర్‌ పక్కన కూర్చున్న మలకు మానె (36) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.     

(చదవండి: సిగ్నల్‌ వద్ద బ్రేక్‌ బదులు ఎక్స్‌లేటర్‌ తొక్కడంతో..ఇద్దరు మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement