రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ

40 Laksha Has Been Recovered By Authorities In Fake Challan Case In AP - Sakshi

అమరావతి: ఏపీలో రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారంలో అధికారులు మరో రూ.40 లక్షలు రికవరీ  చేశారు. ఇప్పటివరకు రూ.కోటి 77 లక్షలు అధికారులు రికవరీ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా నకిలీ చలానాల కేసులో 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. డాక్యుమెంట్‌ రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్లు, మధ్యవర్తుల పాత్రపై విచారణ జరుగుతోంది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top