Sarfaraz Ahmed Viral Video: కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయిన క్రికెటర్‌.. వీడియో వైరల్‌

Pakistan Batter Sarfaraz Ahmed Gets Clean-Bowled By His 5-Year Old Son - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తన ఐదేళ్ల కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ తన కొడుకు ఐదేళ్ల జూనియర్‌ సర్ఫరాజ్‌తో కలిసి ఒక గల్లీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. తాను సరదాగా బ్యాటింగ్‌ చేయగా.. కొడుకు బౌలింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ కొడుకు ఒక పర్‌ఫెక్ట్‌ యార్కర్‌ సంధించగా.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

తన కుమారుడివైపు ఒక లుక్‌ ఇచ్చిన సర్ఫరాజ్‌ చిరునవ్వుతో తన కొడుకును మెచ్చుకున్నాడు. ఐదేళ్ల అబ్దుల్లా(సర్పారజ్‌ అహ్మద్‌ కొడుకు) ఇప్పటికే లోకల్‌ క్రికెట్‌ అకాడమీలో క్రికెటర్‌గా రూపుదిద్దుకుంటున్నాడు. కాగా గతంలో ఇక్కడి రాజకీయాలతో విసిగిపోయానని.. అది క్రికెట్‌కు కూడా పాకిందని.. తన కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో క్రికెటర్‌ను కానివ్వను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి తాజాగా తనను క్లీన్‌బౌల్డ్‌ చేసిన కుమారుడిని భవిష్యత్తులో స్టార్‌ క్రికెటర్‌గా మారుస్తాడేమో చూడాలి. 

ఇక సర్ఫరాజ్‌ అహ్మద్‌కు పాకిస్తాన్‌ టీంలో అంతగా అవకాశాలు రావడం లేదు. దీనికి ఒక కారణం ఉంది. వికెట్‌ కీపర్‌ అయిన సర్ఫరాజ్‌ అహ్మద్‌ మంచి బ్యాటర్‌ కూడా. అయితే మహ్మద్‌ రిజ్వాన్‌ రూపంలో పాక్‌కు మంచి యంగ్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ దొరికాడు. ప్రస్తుతం రిజ్వాన్‌ అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దీంతో సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. సర్ఫరాజ్‌ చివరిసారి పాక్‌ తరపున 2021 ఏప్రిల్‌లో సౌతాఫ్రికాతో ఆడాడు.

ఇక సర్ఫరాజ్‌ అహ్మద్‌ పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్‌ 2017లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీ గెలుచుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్‌ ట్రోపీని దక్కించుకుంది. ఇక సర్ఫరాజ్‌ అహ్మద్‌ పాకిస్తాన్‌ తరపున 49 టెస్టుల్లో 2657 పరుగులు, 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టి20ల్లో 818 పరుగులు సాధించాడు.

చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్‌ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'

 కామెంటరీ ప్యానెల్‌ ఇదే.. మరో క్రికెట్‌ జట్టును తలపిస్తుందిగా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top