మై భారత్‌ యూత్‌ ఐకాన్‌గా హరీష్‌ | - | Sakshi
Sakshi News home page

మై భారత్‌ యూత్‌ ఐకాన్‌గా హరీష్‌

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

● జాతీయ స్థాయిలో గుర్తింపు ● నామినేట్‌ చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ

● జాతీయ స్థాయిలో గుర్తింపు ● నామినేట్‌ చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ

చిత్తూరు కలెక్టరేట్‌ : ఐరాల మండలం 45 కొత్తపల్లికి చెందిన యువకుడు కల్వకుంట్ల హరీష్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్‌ సంస్థ ఆయనను మై భారత్‌ యూత్‌ ఐకాన్‌గా నామినేట్‌ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అందింది. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్న మై భారత్‌ నుంచి ఈ గుర్తింపు లభించడంపై హరీష్‌ హర్షం వ్యక్తం చేశారు. హరీష్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కేంద్ర మంత్రిత్వ శాఖకు, మై భారత్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి మొదలైన తన ప్రయాణానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. యువత సాధికారత, విద్య, ఆరోగ్యం, ఓటరు, పర్యావరణ, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో మరింత అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనలో యువతను కీలక భాగస్వాములుగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. హరీష్‌కు పలువురు అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్‌ విద్యార్థులు

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (సీతమ్స్‌)కు చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. అనంతపురం జేఎన్‌టీయూఏ ఆధ్వర్యంలో ఈ నెల 24న కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో సీతమ్స్‌కు చెందిన కె.మౌనిక (ఈసీఈ ఫైనల్‌ ఇయర్‌), కె.షాలిని (సీఎస్‌ఈ–ఏఐ సెకండ్‌ ఇయర్‌) విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న విద్యార్థినులను కళాశాల ఎండీ కల్పజ, చైర్మన్‌ రంగనాథం, సీఈ నాగేంద్రప్రసాద్‌ అభినందించారు. క్రీడాకారిణులను తీర్చిదిద్దిన ఫిజికల్‌ డైరెక్టర్లు శాంతకుమార్‌, శ్వేతా కృష్ణ కృషిని వారు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement