అప్పీల్‌లో టెన్షన్‌.. టెన్షన్‌! | - | Sakshi
Sakshi News home page

అప్పీల్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

చిత్తూరు మండలంలో అప్పీల్‌కు వెళ్లిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ అనంతాపురం సహా ఐదు పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థుల అప్పీళ్లు తిరస్కరణ అధికారుల తీరుపై మండిపడిన బాధితులు కుట్రపూరితంగానే రిజెక్ట్‌ చేశారని ఆరోపణ తాళంబేడు, గువ్వకల్లు, పాలూరు అప్పీళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ రాత్రి 9 గంటల వరకు తేల్చని అధికారులు వైఎస్సార్‌సీపీ శ్రేణుల పట్టుతో ఉత్తర్వులు జారీ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం తిరస్కరణకు గురై అప్పీల్‌కు వెళ్లిన సర్పంచ్‌ అభ్యర్థుల విషయంలో చిత్తూరు మండలంలో గురువారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అప్పీళ్ల విచారణ, తుది ఉత్తర్వుల జారీలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో రాత్రి వరకు మండల పరిషత్‌ కార్యాలయం, సంబంధిత కేంద్రాల వద్ద టెన్షన్‌ వాతావరణం కనిపించింది.

ఐదు పంచాయతీల్లో అప్పీళ్లకు చుక్కెదురు

చిత్తూరు మండలంలోని పలు కీలక పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థులు తమ నామినేషన్ల తిరస్కరణపై అప్పీల్‌ దాఖలు చేసుకున్నారు. అనంతాపురంతో పాటు నాయనిచెరువు, తుమ్మింద, తొప్పాతిపల్లి, పెద్దిశెట్టిపల్లి పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థులు వేసిన అప్పీళ్లను కూడా అధికారులు తిరస్కరించారు. ఎలాంటి సరైన కారణాలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, కుట్రపూరితంగానే తమ అప్పీళ్లను రిజెక్ట్‌ చేశారని బాధిత అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్కంఠంగా తాళంబేడు

మరోవైపు అప్పీల్‌కు వెళ్లిన అభ్యర్థుల్లో తాళంబేడు, గువ్వకల్లు గ్రామ పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థులకు ఊరట లభించింది. అలాగే పాలూరు, కుర్చివేడు సర్పంచ్‌ అభ్యర్థులు కూడా అప్పీల్‌లో నామినేషన్లకు ఆమోదం లభించింది. దీంతో ఆయా గ్రామాల అభ్యర్థులు, వారి మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. తాళంబేడు, గువ్వకల్లు సర్పంచ్‌ అభ్యర్థులు దాఖలు చేసుకున్న అప్పీల్‌పై అధికారులు స్పష్టత ఇచ్చేందుకు జాప్యం చేయడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

రాత్రి 9 గంటల వరకు హైడ్రామా

అప్పీళ్ల పరిష్కారంలో భాగంగా గువ్వకల్లు, తాళంబేడు సర్పంచ్‌ అభ్యర్థుల అప్పీళ్లను రాత్రి 9 గంటల వరకు తేల్చకుండా అధికారులు నాన్చారు. సమయం మించిపోతున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారుల తీరును నిలదీశారు. తక్షణమే అప్పీళ్లపై నిర్ణయాన్ని వెల్లడించి, ఉత్తర్వు పత్రాలను అందించాలని పట్టుబట్టారు. దీంతో దిగివచ్చిన అధికారులు, రిటర్నింగ్‌ అధికారుల ద్వారా సంబంధిత ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. దీంతో రాత్రి వరకు సాగిన ఉత్కంఠకు తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement