పులికాట్ సరస్సులో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. రష్యా, ఉజ్బెకిస్తాన్, సైబీరియా, నైజీరియా, చైనా, ఐరోపా తదితర దేశాల నుంచి వేళ మైళ్లు ప్రయాణించి పులికాట్ సరస్సు సమీపంలోని అటవీ ప్రాంతానికి వచ్చి చేరాయి. పక్షుల రాకతో శ్రీహరికోట వెళ్లే మార్గంలో సందడి నెలకొంది. విదేశీ పక్షులు అందరినీ అలరిస్తూ.. నీటిలో చక్కర్లు కొడుతూ పర్యాటకుల చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు 49 రకాల జాతులు, 63,397 పక్షులు వచ్చినట్టు సమాచారం. ఈ సారి గ్రేటర్ ఫ్లెమింగోలు ఎక్కువ రావడం విశేషం. వీటితో పాటు గ్రే ఫెలికాన్స్, ఓపెన్ బిల్డ్ స్టార్క్, బ్లాక్ హెడెడ్ గల్, పర్పుల్ స్వాంఫెన్, ఫీజెంట్ టెయిల్డ్ జకానా, శాండ్ పైపర్లు, కెంటిష్ ప్లవర్, యూరేషియన్ స్పూన్‌బిల్, గార్గనీ లెస్సర్ విస్లింగ్ డక్, ఓస్ప్రే తదితర పక్షులు పులికాట్‌కు చేరాయి.
– సూళ్లూరుపేట రూరల్
వివిధ రకాల పక్షులు


