సత్ఫలితాలిస్తోంది | - | Sakshi
Sakshi News home page

సత్ఫలితాలిస్తోంది

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

పంచగవ్య వాడకం పంటలకు సత్ఫలితాలను ఇస్తోంది. నేలలో సారం పెరుగుతోంది. ఇంటివద్దే పంచగవ్యను తయారుచేసుకుంటాం. అలా తయారుచేసిన పంచగవ్యతోనే వరిపైరు సాగాచేశా. ప్రస్తుతం మామిడి తోటలకు కూడా పిచికారీ చేస్తున్నా. రసాయనాలను వదలిపెట్టి సేంద్రీయ పద్ధతిలో సాగుచేయాలనుకునే రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దిగుబడి కూడా ఎక్కువగా వస్తోంది.

– సుబ్బరాజు, రైతు, గుండ్రాజుకుప్పం గ్రామం

అవగాహన కల్పిస్తున్నాం

రైతులకు పంచగవ్య ఉపయోగాలపై అవగాహన కల్పిస్తున్నాం. పంచగవ్యలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి స్థూల పోషకాలతో పాటు జింక్‌, మెగ్నీషియం, కాల్షియం, రాగి, మాంగనీస్‌ వంటి సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండడంతో మొక్కల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతోంది. మొక్కలు వేగంగా ఎదగడమే కాకుండా, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది.

– రాఘవేంద్రయాదవ్‌,

వ్యవసాయ అధికారి, నగరి మండలం

Advertisement
 
Advertisement
Advertisement