భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో.. | - | Sakshi
Sakshi News home page

భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో..

Mar 1 2026 7:51 AM | Updated on Mar 1 2026 7:51 AM

భూమి

భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో..

మార్గం వివాదం.. మానసిక ఒత్తిడి

వెదురుకుప్పం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆత్మహత్యకు యత్నించారు. తన భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేసినా మండల అధికారులు పట్టించుకోకపోవడంతో కలత చెంది గరికదొన గ్రామానికి చెందిన నాగరాజు ఈ ఏడాది జనవరి 19వ తేదీన కలెక్టరేట్‌లో శరీరంపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

● అలాగే కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా ఉన్నా రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించడంలో విఫలం కావడంతో వెదురుకుప్పం మండలం పచ్చికాపలంకు చెందిన సాయికుమార్‌ ఆవేదన చెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన కలెక్టరేట్‌ వద్ద శరీరంపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. చట్టబద్ధమైన కోర్టు ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడం పరిపాలన వ్యవస్థలోని అత్యున్నత స్థాయి ఉదాసీనతను సూచిస్తోంది.

భూ ఆక్రమణ సమస్య పరిష్కారానికి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సాయికుమార్‌ (ఫైల్‌)

భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో.. 1
1/2

భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో..

భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో.. 2
2/2

భూమి ఆక్రమణ గురించి పట్టించుకోకపోవడంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement