కాణిపాకం ఆలయానికి భూ కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

కాణిపాకం ఆలయానికి భూ కేటాయింపు

Mar 1 2026 7:51 AM | Updated on Mar 1 2026 7:51 AM

కాణిప

కాణిపాకం ఆలయానికి భూ కేటాయింపు

● 18.60 ఎకరాలకు ఆమోదంపై హర్షం ● అపోలో వర్సిటీలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

కాణిపాకం : కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పాలక మండలి సమావేశం శనివారం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన 18.60 ఎకరాల భూమి కేటాయింపుపై మండలి సభ్యులు సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యే మురళీమోహన్‌, చైర్మన్‌ మణినాయుడు, ఈఓ పెంచల కిషోర్‌ సమావేశాన్ని నిర్వహించారు. కాణిపాకం పట్నం సమీపంలో ఆరు వరుసల రహదారి వద్ద దేవస్థానానికి భూమి కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో గోశాల నిర్వహణకు నూతన భూమి కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో పాటు 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అంచనాలు, ఖర్చులు, మిగులు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు తాగునీరు, శ్రామిక వసతులు, శుభ్రత తదితర అంశాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

శాసీ్త్రయ ఆలోచనలు అవసరం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో వర్సిటీలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం–2026ను శనివారం నిర్వహించారు. పాఠశాల స్థాయి సైనన్స్‌ ప్రాజెక్టుల ప్రదర్శన ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత శాసీ్త్రయ విద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్‌ఈఆర్‌) తిరుపతి జీవశాస్త్ర విభాగం చైర్‌పర్సన్‌ డా. వసుధారాణి దేవనాథన్‌ శాసీ్త్రయ ఆలోచనల ప్రాముఖ్యం వివరించారు. వైస్‌ ఛాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ శాసీ్త్రయ దక్పథం అవసరాన్ని ప్రస్తావించారు. మొత్తం 288 ప్రాజెక్టులు ప్రదర్శించగా, గణితం 35, జీవశాస్త్రం 81, భౌతిక–రసాయన శాస్త్రాలు 89, పర్యావరణ శాస్త్రం 83 ప్రాజెక్టులు ఉన్నాయి. ముగింపులో విజేతలకు బహుమతులు అందజేశారు.

కాణిపాకం ఆలయానికి భూ కేటాయింపు 
1
1/1

కాణిపాకం ఆలయానికి భూ కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement