అక్షర పోరాటం | - | Sakshi
Sakshi News home page

అక్షర పోరాటం

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

అక్షర పోరాటం

అక్షర పోరాటం

పదో తరగతి విద్యార్థులకు

ప్రత్యేక తరగతులు

ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ

అల్పాహారం లేక నీరసిస్తున్న పిల్లలు

నిధుల కొరత అంటున్న

విద్యాశాఖ అధికారులు

దాతలు ముందుకు రావాలని విన్నపాలు

ఆకలి కడుపులతో

విద్యార్థులకు పదో తరగతి కీలకం. ఇందులో వచ్చిన మార్కులను బట్టే ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వంద శాతం ఉత్తీర్ణతతోపాటు ఉత్తమ ఫలితాల సాధించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలు ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి వస్తున్నారు. సాయంత్రం ఇంటికి చేరుకోవడానికి 6 గంటలకు పైగా అవుతోంది. ఈ క్రమంలో నీరసించిపోయి చదువులపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. వారికి సాయంత్రం అల్పాహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌: ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 326 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 25 వేల మందికిపైగా పదో తరగతి విద్యార్థులు చదువుతున్నా రు. వారికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌తోపాటు ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాలు సాఽ దించాలని ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు సాయంత్రానికి నీరసించిపోతున్నారు. వారికి సాయంత్రం వేళ స్నాక్స్‌ అందించాలంటే ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించలేదు. పిల్లలు మధ్యా హ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మధ్యా హ్నం ఒంటి గంటకు తింటున్న భోజనం తప్ప మరే ఆహారం లేకపోవడంతో సాయంత్రానికి విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. కాలే కడుపుతో చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడుతున్నారు.

దాతలు ముందుకురావాలి

విద్యార్థుల పరిస్థితిని గమినించిన విద్యాశాఖ అధికారులు దాతల సహాయాన్ని కోరుతున్నాయి. ప్రభు త్వం మధ్యాహ్న భోజనం అందిస్తోంది. కానీ సాయంత్రం ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించేందుకు నిధుల కొరత ఉందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలున్న ప్రాంతాల్లో దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి స్నాక్స్‌ పంపిణీ చేస్తే పిల్లలు ఉత్సాహంగా చదువుకుంటారని చెబుతున్నారు.

జిల్లా సమాచారం

నియోజకవర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

చిత్తూరు 32

గంగాధరనెల్లూరు 49

కుప్పం 88

నగరి 25

పలమనేరు 84

పూతలపట్టు 48

మొత్తం 326

నీరసిస్తున్న విద్యార్థులు

సుదీర్ఘ గంటల పాటు చదువుకోవడం వల్ల విద్యార్థులు శారీరక శక్తిని కోల్పోతున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సా యంత్రం వరకు ఏమీ తినకపోవడంతో చాలా మంది విద్యార్థులు నీరసానికి గురవుతున్నారు. కనీసం సాయంత్రం వేళల్లో బిస్కెట్లు, పాలు లేక ఏదైనా అల్పాహారం అందుబాటులో లేకపోవడంతో వా రు చదువుపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. ఆకలి కడు పులతో పాఠాలు వినడం, చదవడం పెద్ద సవాలుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement