హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి ఆదేశించారు. ఆమె శుక్రవారం వైద్యాధికారులతో జిల్లాలో రెండు నెలల్లో నమోదైన మాతృ, శిశు మరణాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో రెండు నెలల్లో నలుగురు తల్లులు, 11 మంది చిన్నారులు మృతిచెందినట్టు తెలిపారు. హైరిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించి ప్రత్యేక వైద్యం అందించాలన్నారు. మహళ గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించాలనిసూచించారు. పౌష్టికాహారం, రక్తహీనత నివారణపై పర్యవేక్షణ ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పెద్దాసుస్పత్రులకు రిఫర్ చేసి సురక్షిత ప్రసవం జరిగేలా చూడాలన్నారు. బాల్యవివాహాల నివారణతో పాటు టీనేజ్ గర్భధారణలపైనా ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ప్రతి నెల 9వ తేదీన పీహెచ్‌సీల్లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, గర్భిణులకు పరీక్షలు చేయించి మందుల పంపిణీ చేయాలన్నారు. గుండెజబ్బులు, థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం వంటి క్లిష్ట సమస్యలతో ఉన్న గర్భిణులను ప్రత్యేకంగా చూ డాలని, అసరమైతే ప్రసవం సమయానికి వారం ముందుగానే ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇచ్చేలా అవగాహన కల్పించాలని, షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు వేయించాలని సూచించారు. సూచనలను కచ్చితంగా అమలు చేస్తే మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీహెచ్ డాక్టర్ పద్మాంజలి, డాక్టర్లు హనుమంతరావు, ఉషశ్రీ, లత, అనూష, పూజ, హేమావతి, శ్రీలత, వెంకటేశ్వరి, రోజారాణి, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు


